

గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులు కూలీలు సద్వినియోగం చేసుకోవాలని
మండల ప్రత్యేక అధికారి శిరీష
జనం న్యూస్ మే 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
మెరుగైన జీవనోపాధి కోసం ఉపాధి హామీ పనులను వినియోగించుకోవాలని వేసవిలో ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష అన్నారు.గురువారం మునగాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనులను పరిశీలించారు.పని ప్రదేశంలో కల్పిస్తున్న మౌళిక వసతులపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎండాకాలం కావున ఉపాధి హామీ కూలీలు ఉదయం తొందరగా రావాలని,ఎండలు ముదురుతున్న కొద్ది పనుల వద్ద జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. అలాగే పని ప్రదేశంలో నీటి సౌకర్యం కూడా కల్పించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్,ఏపీవో శైలజ, పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
