Listen to this article

అద్దాల మందిరంలోని సీతారాములకు అభిషేకాలు

నిర్వహించిన రామకోటి రామరాజు

జనం న్యూస్, మే 10 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

ఆపరేషన్ సింధూర్ లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యం పాకిస్తాన్ పై విజయం సాధించాలని కోరుతూ శుక్రవారం శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో అద్దాల మందిరం వద్ద సీతారాములకు లిఖిత శ్రీరామ నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా సైన్యానికి మద్దతుగా ఇవ్వాలని పూజలు నిర్వహించాలని దేవాదయశాఖ సూచన మేరకు అద్దాల మందిరం వద్ద పూజలు నిర్వహించామన్నారు. ప్రతి సైనికుడు విరోచితంగా పోరాడి పాకిస్తాన్ పై విజయం సాధించాలని కోరామన్నారు. ఆపరేషన్ సింధూర్ 2 విజయం తప్పకుండ సాధిస్తుందని, భారత్ ఎదురులేని శక్తిగా ఎదుగుతుందన్నారు.