Listen to this article

రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చండ్ర నరేంద్ర కుమార్ డిమాండ్.

జనం న్యూస్,మే09, జూలూరుపాడు:

గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ఐకెపి కేంద్రాల వద్ద ఆరబెట్టిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చండ్ర నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం జూలూరుపాడు ఐకెపి కేంద్రం వద్ద తడచిన వరి ధాన్యాన్ని తెలంగాణ రైతు సంఘ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐకెపి కేంద్రాల వద్ద వర్షాలకు తడచిన, కల్లాలలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం బాధ్యత తీసుకొని, తడచిన ధాన్యానికి మద్దతు ధరకు తక్షణమే కొనుగోలు చేయాలని, ధాన్యంలో తేమ శాతం, తాలూ, తదితర కారణాలతో కొనుగోలు సంస్థలు కుంటి సాకులు చెబుతూ రైతుల ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని,తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని నష్ట నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులు బాధ్యత తీసుకొని జిల్లావ్యాప్తంగా అకాల వర్షాలకు నష్టపోయిన వరి రైతులు, కాయ రాలిపోయిన మామిడి రైతులు, పళ్ళ తోటలు, కూరగాయ తోటలు సాగు చేస్తున్నటువంటి రైతంగాని ఆదుకుని అన్నదాతకు ఆసరాగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు ఎల్లంకి మధు, చెరుకుమల్లి రాజేశ్వరరావు, కొండా వీరయ్య, ఎస్కే నాగుల్ మీరా, కంచర్ల రాజు, ఎస్.కె చాంద్ పాషా, పాలెపు ప్రభాకర్, సతీష్, పాల్గొన్నారు.