Listen to this article

జనంన్యూస్. 09.సిరికొండ. ప్రతినిధి.

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు, నిజామాబాద్ పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు నాటికలు, పాటల రూపంలో వివిధ సామాజిక అంశాలపై విలువైన సందేశాలు అందించబడ్డాయి.రోడ్డు భద్రతపై అవగాహన.హెల్మెట్ ధరించండి హెల్మెట్ బరువు కాదు, ఇది బాధ్యత జీవించు, జీవించనివ్వు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి
మహిళల రక్షణ కోసం:మహిళలు ఏవైనా అసౌకర్యానికి గురైనపుడు She Team నంబర్ 8712659795 లేదా డయల్ 100 కు కాల్ చేయగలరుమొబైల్ పోగొట్టినపుడు:మొబైల్ దొంగిలింప పోతయిన సందర్భంలో సి ఇ ఐ ర్ పోర్టల్ ద్వారా రికవరీ చేయించుకోవచ్చు అత్యవసర పరిస్థితుల్లో:ఎమర్జెన్సీ సేవల కోసం Dial 100 ఉపయోగించండి అంధవిశ్వాసాలపై అవగాహన: మంత్ర, తంత్రాలు వంటి మూఢనమ్మకాలను నమ్మవద్దు అవి మోసమేగ్రామ భద్రతప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఒక్క కెమెరా వంద మంది పోలీసులతో సమానం ఆన్లైన్ మోసాలపై హెచ్చరిక: సైబర్ మోసాల నుండి రక్షణ కోసం అప్రమత్తంగా ఉండండి. ఏదైనా మోసానికి గురైతే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు ఫోన్ చేయండి విదేశీ ఉద్యోగాలపై జాగ్రత్తలు:
గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలి నకిలీ ఏజెంట్లు నిరుద్యోగులను మోసం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు: మత్తు పదార్థాలు జీవనాన్ని నాశనం చేస్తాయి మాదకద్రవ్యాల వినియోగం నేరం – చట్టపరమైన శిక్షకు లోనవుతారు యువత మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలి సామాజిక సమతా సందేశం: అందరూ అన్నదమ్ముల్లా శాంతియుతంగా కలిసిమెలిసి జీవించాలి సమాజంలో జరుగుతున్న నేరాలు, చట్టాలపై అవగాహన కల్పించబడింది ఈ కార్యక్రమంలో సిరికొండ పోలీస్ స్టేషన్ SI రామ్ కళాబృందం సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.