Listen to this article

(జనం న్యూస్ చంటి) మే 12 2025

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ACF) 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి హైదరాబాదులోని రోజంతా జరుపుకుందాం. 1974 ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో అమరులు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఏర్పడింది. 2024 డిసెంబర్ 14 15 తేదీల్లో తన 50 వసంతాల సభలను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే తన 50 ఏళ్ల చరిత్రను, కృషిని, సృజించుకునే పనితో పాటు ‘ అరుణోదయం’ అనే సావనీర్ ఆవిష్కరించుకునే కార్యక్రమం మిగిలే ఉంది. అలాగే అరుణోదయ డాక్యుమెంటరీని, విప్లవ ప్రజా సంస్థల 50 ఏళ్ల ప్రస్థానపు పాటను ప్రదర్శించుకుంటూ జరిగే అరుణోదయ 50 ఏళ్ళ పరిపూర్తి ముగింపు సభలను జయప్రదం చేయాలని కళాకారులకు ప్రజా కళాభిమానులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బోనాల స్వామి, కార్యదర్శి సూరంపల్లి మహేందర్ లతోపాటు గోవిందాపూర్ ఎల్లం, మిరుదొడ్డి మల్లేశం, ప్రజాసంఘాల నాయకులు కీసర ఎల్లం, పిట్ల మల్లేశం, బొల్లం యాదగిరి,MRPS నాయకులు సాయిలు తదితరులు పాల్గొన్నారు.