Listen to this article

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మే 9 :

ఏన్కూర్ గ్రామస్తుల సమక్షంలో పిటిఎం సమావేశం నిర్వహించడం జరిగిందని స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కే సైదయ్య తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తమ పాఠశాలలో అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారని, విశాలమైన ఆట స్థలము సకల సదుపాయాలు గల తరగతి గదులతో డిజిటల్ విద్యాబోధన, పాఠశాలకు దూర ప్రాంతాల నుండి వచ్చు విద్యార్థులకు ట్రావెలింగ్ అలవెన్స్, ప్రతినెల ఆర్బిఎస్కే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారిచే విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు, పాఠశాలలో గణిత మరియు సైన్సు ప్రయోగశాలలు , గ్రంథాలయ సౌకర్యం ఉన్నాయని, బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ కొరకు కరాటే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయని ,ప్రత్యేక తరగతులు ,వ్యక్తిగత శ్రద్ధ ఉంటుందని, పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించబడుతుందని, ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ కొరకు శిక్షణ ఇవ్వబడుతుందని, స్వచ్ఛంద సంస్థల ద్వారా దూర ప్రాంత విద్యార్థులకు సైకిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం ,వారానికి మూడు కోడి గుడ్లు ,రాగిజావ ,ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోటి పుస్తకాలు ,ఉచిత దుస్తులు అందించబడతాయని తెలిపారు. గత సంవత్సరం ఎస్ఎస్సి లో మా విద్యార్థిని విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపారని 400 మార్కులు దాటిన విద్యార్థులు 27 మంది ఉన్నారని ,12 మందికి వివిధ సబ్జెక్టులలో ఏ వన్ గ్రేడ్లు వచ్చాయని తెలిపారు. కావున విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలని కోరారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాఘవరావు, ప్రేమానందం, హుస్సేన్ ,సిఆర్పి కృష్ణ ప్రసాద్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు