Listen to this article

రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో పిర్యాదు చేస్తున్న బచ్చల లక్ష్మయ్య.

జనం న్యూస్,మే09,జూలూరుపాడు:

సీలింగ్ భూమి అక్రమ పట్టాలు,ప్రభుత్వం భూమి పై అక్రమంగా జరుగుతున్న వ్యాపారాన్ని అరికట్టాలని, వ్యాపారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జూలూరుపాడు మండలం నల్లబండ బోడు, గ్రామ నివాసి,గ్రామీణ పేదల సంఘం నాయకులు బచ్చల లక్ష్మయ్య తెలిపారు, జూలూరుపాడు మండలం గుండపూడి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూమిపై, సీలింగ్ భూములు పై అక్రమ పట్టాలు పొంది అక్రమ మట్టి వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం నాడు కొత్తగూడెం రెవిన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు.