

(జనం న్యూస్ మే 9చంటి) మే 12 2025
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ACF) 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి హైదరాబాదులోని రోజంతా జరుపుకుందాం. 1974 ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో అమరులు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఏర్పడింది. 2024 డిసెంబర్ 14 15 తేదీల్లో తన 50 వసంతాల సభలను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే తన 50 ఏళ్ల చరిత్రను, కృషిని, సృజించుకునే పనితో పాటు ‘ అరుణోదయం’ అనే సావనీర్ ఆవిష్కరించుకునే కార్యక్రమం మిగిలే ఉంది. అలాగే అరుణోదయ డాక్యుమెంటరీని, విప్లవ ప్రజా సంస్థల 50 ఏళ్ల ప్రస్థానపు పాటను ప్రదర్శించుకుంటూ జరిగే అరుణోదయ 50 ఏళ్ళ పరిపూర్తి ముగింపు సభలను జయప్రదం చేయాలని కళాకారులకు ప్రజా కళాభిమానులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సంస్కృతి అంటే కళ లు, జ్ఞానం అనే పరిమిత అవగాహన మారుతూ, మానవ శాస్త్రం (Anthropology)చెప్పినట్టు మొత్తం జీవిత విధానమే సంస్కృతి అనే విషయం తేటతెల్లమవుతున్న 71 దశకంలోనే అరుణోదయ లాంటి విప్లవ సాంస్కృతిక సంఘాల ఆవిర్భావం జరిగింది. నక్సల్బరి- శ్రీకాకుళం గోదావరి లోయ సాయుధ పోరాటాల వాటి ఏర్పాటుకు తక్షణ హేతువుగా ఉంది. మానవ పరిణామ క్రమంలో వానరుడు నరుడిగా పరివర్తన చెందడంలో శ్రమ నిర్వహించిన పాత్ర గురించి చదువుకున్నాం. అలా మానవుల శరీరాలకు- మధ్య జరిగిన సంఘర్షణలో చోదక శక్తిగా పనిచేసిన శ్రమ, అది సృష్టించిన ఉత్పత్తి- పంపిణీలో ఏర్పడ్డ మానవ సంబంధాల చుట్టూ, వాటి సంఘర్షణల చుట్టూ సంస్కృతిని పెనవేసుకొని ఉంది. అందుకే సమిష్టి శ్రమ సంస్కృతిలో పుట్టిన మానవులు, అందులోనే పెరిగి, సంస్కృతిలోనే తమ ముగిస్తున్నారు. సరుకుగా దాని యజమానిగా ఉన్న శ్రామికుని నుండి పరాయికరించబడినది. ఆ శ్రమ సంపద కొల్లగొట్టడానికి జరిగిన పోరాటంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. వాటిని ఓడించి శ్రమజీవులకు పట్టం కట్టే విప్లవ పోరాటాలు జరిగాయి. ఈ క్రమంలోమన దేశంలో ఆధిపత్య దోపిడీ సంస్కృతికి- ప్రజా సంస్కృతికి మధ్య జరుగుతున్న సంఘర్షణ వర్గ-కుల పోరాట రూపంలో ప్రతిబింబిస్తూ వస్తున్నది ఇలాంటి పోరాటాలతో పెనవేసుకుని అరుణోదయ ఒక సంస్థ ప్రజా సాంస్కృతికోద్యమం అధికంగా పనిచేసింది. చేస్తూనే ఉంది. ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బోనాల స్వామి, కార్యదర్శి సూరంపల్లి మహేందర్ లతోపాటు గోవిందాపూర్ ఎల్లం, మిరుదొడ్డి మల్లేశం, ప్రజాసంఘాల నాయకులు కీసర ఎల్లం, పిట్ల మల్లేశం, బొల్లం యాదగిరి,MRPS నాయకులు సాయిలు తదితరులు పాల్గొన్నారు.