

కూలర్ షాక్ తో తల్లి కూతురు మృతి.
జుక్కల్ ఏప్రిల్ 10 జనం న్యూస్ : కామారెడ్డి జిల్లా, జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల తాండాలో శనివారం తెల్లవారుజాము న విద్యుత్ షాక్ తో తల్లి కూతురు మృతి చెందారు.స్థానికులు,పోలీసుల కథన ప్రకారం గుల్ల తాండకు చెందిన శంకబాయి 36 సంవత్సరాలు కూతురు చవాన్ శివాని(12) ఇంట్లో నిద్రపోతున్న క్రమంలో ఎండ వేడిమి నివారణ కోసం కూలర్ పెట్టుకోగా ప్రమాదవశక్తుగా శివాని ఎడమ కాలు కూలర్ నీటిలో పడగా ప్రమాదవశత్తు ఆ నీటిలో విద్యుత్తు ప్రవహించి కాలు పాక్షికంగా కాళీ పోవటమే కాకుండా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కూతురు పక్క నిద్రపోతున్న తల్లికి కూడా కూతురు ద్వారా విద్యుత్తు ప్రవహించి ఆమె కూడా మృతి చెందింది. కొడుకు ప్రతీక్ బయట పండుకోవడంతో తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లి చెల్లెలు మృత్య వాత పడడంతో ఇటి విషయాన్ని తాండవాసులకు తెలుపడంతో వారు విద్యుత్తును నిలుపుదల చేయించారు. కుటుంబా యజమాని అయినా ప్రహ్లాద్ డ్రైవర్ గా ఉండడంతో ఆయన ఇతర ప్రాంతాల్లోకి వెళ్లినట్లు వారు తెలిపారు. ప్రహ్లాదుకు భార్య ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉండగా భార్య చిన్న కూతురు మృత్య వాత పడటంతో పెద్ద కూతురు బంధువుల వద్దకు పోవడంతో ప్రాణము దక్కిందని తాండవాసులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో జుక్కల్ పోలీసులతో పాటు బిచ్కుంద సిఐ నరేష్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.