

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,
సిబ్బంది సమస్యల పరిష్కారంకు ప్రత్యేకంగా “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించిన జిల్లా ఎస్పీ
జనం న్యూస్ 10 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :విజయనగరం జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యలపరిష్కారానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మే 9న జిల్లా పోలీసు కార్యాలయంలో “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించి, సిబ్బంది నుండి విజ్ఞాపనలు స్వీకరించి, పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు మాట్లాడుతూ – పోలీసు సిబ్బంది సమస్యలపరిష్కారానికి కృషి చేస్తానని, పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తానన్నారు. “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించుటలో
భాగంగా పోలీసు సిబ్బంది ఒక్కొక్కరిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలోని తన చాంబరులోకిపిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను తెలుసుకొని, వారి నుండి విజ్ఞాపనలు స్వీకరించారు.సిబ్బంది విజ్ఞాపనలు పరిశీలించిన జిల్లా ఎస్పీ, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. పోలీసు సిబ్బంది తెలిపిన వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను జిల్లా ఎస్పీ స్వయంగా పుస్తకంలో నోట్ చేసుకొని, వాటి పూర్వాపరాలుపరిశీలించి, పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపడతానని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.