Listen to this article

జనం న్యూస్ 10 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : పద్మవిభూషణ్, డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి , అందాల తార శ్రీదేవి నటించిన “జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమా రిలీజ్ అయ్యి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని మళ్ళీ శుక్రవారం “రీరిలీజ్” అయిన సందర్బంగా.. మెగా అభిమానులు ఎన్ సీ ఎస్ థియేటర్ వద్ద శుక్రవారం వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిధులుగా విచ్చేసిన జనసేన నాయకులు గురాన అయ్యలు , థియేటర్ ఎండీ నారాయణం శ్రీనివాస్ , థియేటర్ మేనేజర్ ఫిల్మ్ శ్రీను, వ్యాపారవేత్త గోవింద్ చేతులమీదుగా కేక్ కటింగ్, మజ్జిగ చలివేంద్రం ,థియేటర్ స్టాఫ్ కు గొడుగులు, స్వీట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జనసేన నేత గురాన అయ్యలు మాట్లాడుతూటాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఒకటి అన్నారు..1990లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనాలకు మారు పేరైందన్నారు. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఒక సోషియో ఫాంటసీ చిత్రమన్నారు.అప్పట్లో రూ.15 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిందన్నారు.ఈ సినిమాను 4K, 3D ఫార్మాట్‌లలో రీ రిలీజ్ చేయడం విశేషమన్నారు ఇందుకోసం మేకర్స్ అక్షరాల రూ.8 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుందన్నారు.రీ రిలీజ్ సినిమా కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే మాములు విషయం కాదన్నారు. ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన ఏ సినిమాపై కూడా ఈ రేంజ్‌లో హైప్ క్రియేట్ అవ్వలేదన్నారు.. గతంలో కంటే మెరుగైన అనుభూతితో 2D, 3D ఫార్మాట్లలో మళ్లీ థియేటర్లలో ఈ ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రాన్ని ఎంజాయ్ చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు.విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు త్యాడ రామకృష్ణారావు( బాలు) ఆధ్వర్యంలోజరిగిన ఈ కార్యక్రమంలోచిరంజీవి యువత ప్రతినిధులు, జనసేన యువనాయకులు పిడుగు సతీష్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, లోపింటి కళ్యాణ్, ముదిలి శ్రీనివాస్, ఎంటి రాజేష్,లంకపట్నం కుమార్, రామకృష్ణ, పత్రీ సాయికుమార్, నారంశెట్టి వెంకటరమణ, పవన్ కుమార్ , సీనియర్ మెగాభిమానులు పత్తిగిల్లి వెంకటరమణ, చిన్న, రాంకీ, మహేష్, కృష్ణారావు తదితరులతో పాటు భారీగా అభిమానులు పాల్గొన్నారు