


జనం న్యూస్ మామిడి రవి శాయంపేట : రేపటినుండి బ్రహ్మోత్సవాలు కాకతీయుల కళావైభవానికి ప్రతీక ఈ దేవాలయం రాష్ట్రంలోనే రెండో పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి శాయంపేటమండల కేంద్రంలోని శ్రీ మత్స్యగిరి స్వామి కలియుగంలో కోరిన కోర్కెలు తీర్చే దైవముగా ప్రసిద్ధిగాంచిన కాకతీయ రాజుల కళా వైభవానికి ప్రత్యేకగా నిలిచిన మత్స్యగిరి స్వామి ఆలయంప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి పంచమ రాత్రి ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ మత్స్యగిరి స్వామి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందిఆ క్రమంలో శనివారం నుండి బుధవారం వరకు నిర్వహించుటకు చలువ పందిళ్లు వేసి ఏర్పాట్లు చేసినట్లు దేవాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు.ఆలయ చరిత్ర శాయంపేట గ్రామ పొలిమేరలోని మచ్చర్లయ్య గుట్టపై శ్రీ మత్స్యగిరి స్వామి ఆరు శతాబ్దాల క్రితం సుమారు 569 సంవత్సరాల క్రితం కొలువుదీరినట్లు పూర్వీకులు పేర్కొంటున్నారుమహావిష్ణువు దుష్టశిక్షణకై దశావతారాలలో భాగంగా మొదట మత్స్యవతారంగా వెలసినట్లు చెబుతున్నారు మచ్చర్లయగుట్ట వద్ద గ్రామ్య భాషలో శాలివాహన శకంలో వేయించిన శిలాశాసనం ద్వారా ఆనాటి దేవాలయ చరిత్ర తెలియజేస్తుంది గుట్ట లోపల బండరాయిపై సహజ సిద్ధంగా మచ్చా అవతారంలో స్వామివారు దర్శనమిస్తారుఈ గుట్ట లోపటికి వెళ్లేందుకు ఒకే ఒక చిన్న మార్గం ఉంటుంది ఇక్కడ 14 దేవాలయాలు 24 మంది అర్చకులు ఉండేవారని ఈ శిలా శాసనం ద్వారా తెలుస్తుంది అప్పుడు నిర్మించిన దేవుని చెరువు నేటికీ అదే దేవుని చెరువు పేరుతో పిలువబడుతున్నదికాకతీయ సామంత రాజు కొత్త గట్టు సీమ పాలకుడు రేచర్ల దర్శనాయుడు తన తల్లిదండ్రులు సింగమాంబ సింగమ నాయుడు దేవాలయం నిర్మించినట్లు తెలుస్తుంది కాలక్రమంలో మచ్చర్లయ గుట్ట వద్ద నుంచి గ్రామం దూరంగా వెళ్లిపోయింది గ్రామం మధ్యలో రాతితో శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయాన్ని నిర్మించారు దేవాలయ గోపురం పైన మహావిష్ణువు దశావతారాలు భక్తులకు దర్శనమిస్తాయి.కల్యాణోత్సవ కార్యక్రమం తేదీ మే 10 శనివారం ఉదయం తోలక్కం ప్రారంభం పుట్ట బంగారు సేవ మధ్యాహ్నం ధ్వజారోహణం గరుడ ముద్దా (సంతానం లేని దంపతులు గరుడ ముద్ద ప్రసాదం స్వీకరించగలరు) సాయంత్రం ఎదురుకోళ్లు తేదీ 11 బుధవారం ఉదయం 11 గంటలకు కళ్యాణోత్సవం మధ్యాహ్నం 1 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం తేదీ 12 సోమవారం ఉదయం పూర్ణాహుతి సాయంత్రం 6 గంటలకు గజవాహన సేవ గుట్టమీదికి పోవడం తేదీ 13 మంగళవారం సాయంత్రం రథోత్సవం అలుకతీరుట తేదీ 14 బుధవారం ఉదయం చక్ర వరీ సాయంత్రం నాకబలి నాగవల్లి పండిత సన్మానం తో ఉత్సవాలు ముగిస్తాయని దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు.