

జనం న్యూస్ 11మే పెగడపల్లి ప్రతినిధి : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని మండల కేంద్రంలో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ సైన్యానికి సంఘీభావం తెలుపుతూ శనివారం రోజన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపుమేరకు పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు సంఘీభావ ర్యాలీనీ నిర్వహించడం జరిగింది.ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా వరకు జాతీయ జెండాలను పట్టుకొని పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీనీ నిర్వహించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ పహల్గాంలో అమాయక భారతీయులను పాకిస్తాన్ తీవ్రవాదులు కాల్చి చంపిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన సైనిక చర్యకు ఏఐసిసి అగ్రనాయకులు రాహుల్ గాంధీ , మల్లికార్జున ఖర్గే ,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలియజేయడం జరుగుతుందని,కేంద్ర ప్రభుత్వనికి రాజకీయాలకు అతీతంగా మేముఅండగాఉంటామని,తీవ్రవాదులను పోషించుకుంటూ దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్ కి బుద్ధి చెప్పే విధానంగా సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన సైనిక చర్యను హర్షిస్తున్నామని,భారత దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వనికి మేము అండగా ఉంటామని,వారు ఎటువంటి చర్యలు తీసుకున్న దానికి మా మద్దతు ప్రకటిస్తామని,భారత దేశం వైపు కన్నెత్తి చూడటానికే పాకిస్థాన్ కి వెన్నులో వణుకు పుట్టే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం వీరమరణం పొందిన భారత సైనికుడు మురళి నాయక్ మరియు యుద్ధ వీరులకు నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఓరగల శ్రీనివాస్ మండల నాయకులు సంధి మల్లారెడ్డి కడారి తిరుపతి చెట్ల కిషన్ సింగసాని స్వామి పురుషోత్తం అనిల్ గౌడ్ అజ్మీర అంజి నాయక్ దేశెట్టి లక్ష్మీ రాజం వడ్లూరి ప్రవీణ్ కుమార్ ఐలేని వంశీధర్ రావు అమీరి శెట్టి లక్ష్మీనారాయణ కొత్త శ్రీనివాస్ కొండం మధుసూదన్ రెడ్డి ముదిగంటి పవన్ రెడ్డి ఎడ్ల శ్యామ్ సుందర్ రెడ్డి మూల రామ్ రెడ్డి బొడ్డు రమేష్ తడగొండ కుమార్ లక్ష్మణ్ కృష్ణ మాడిశెట్టి లక్ష్మీనారాయణ మల్యాల ఎల్లయ్య నాయకులు దుర్గాప్రసాద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.