

జనం న్యూస్ – మే 10 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ : శ్రీ శ్రీ మధిరట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని గురువారం ఎన్నుకోవడం జరిగింది. ఆలయ మాజీ అధ్యక్షులు కంచర్ల మురళీకృష్ణ మరియు కమిటీ సభ్యుల అంగీకారంతో మే 1వ తేదీన దేవాలయ పూర్వ భాద్యతలను నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను నాయక్ సమక్షంలో గురువారం రాతపూర్వకంగా రాసి ఇచ్చిన అంగీకార పత్రాన్ని మాజీ అధ్యక్షులు కంచర్ల మురళీకృష్ణ చేతుల మీదుగా నూతన అధ్యక్షుడు బ్రహ్మశ్రీ పరిపూర్ణ కు అందజేయడం జరిగింది. దేవాలయ కు సంబంధించిన పూజారి నివాసము ఆయన ఖర్చులు దేవాలయ ఖర్చులు అన్నీ కూడా అప్పగించడం జరిగినది. అదేవిధంగా దేవాలయానికి సంబంధించిన ఐదు కిరాయి షాపులు మరియు వాటికి వచ్చే కిరాయి డబ్బులు మరియు వాటి సంబంధించిన లావాదేవీలు అన్నీ కూడా రాతపూర్వకంగా రాసి నూతన అధ్యక్షులుకు అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ పాత కమిటీ అధ్యక్షుడు సభ్యులు పాల్గొన్నారు.