Listen to this article

మాదిగ ఐక్యవేదిక

జనం న్యూస్11మే ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమల శంకర్)

ఇటీవల జిల్లా స్థాయి సివిల్ జడ్జిగా ఎంపికైన కాటూరి బిందు ను ఆదివారం నాడు పాల్వంచలో వారి స్వగృహం నందు సుజాతనగర్ మాదిగ ఐక్యవేదిక కమిటీ సభ్యులు పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు ,ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ, మొదటిసారిగా ఒక దళిత మహిళ చదువు ద్వారా భద్రాద్రి జిల్లాలో జడ్జిగా ఎంపిక కావడం దళిత సమాజానికి గర్వకారణం అని, ఇది అన్ని వర్గాల ప్రజలు హర్షించదగ్గ విషయమని ,ఏ వర్గానికి సంబంధించిన వారైనా సరే చదువు ద్వారా గౌరవం వస్తుందని బిందు విషయంలో నిజం అయినదని ,నేడు చదువుకునే మహిళా యువత బిందు ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు, ఎన్నో సంవత్సరాలుగా సమానత్వం లేని మహిళలకు నాటి పూలే దంపతుల కృషి ద్వారా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ గౌరవింపబడుతున్నారని పేర్కొన్నారు బిందు స్పందిస్తూ ,తన తండ్రి కాటూరి సంజీవరావు తనను ప్రత్యేక శ్రద్ధతో చదివించారని, సివిల్ జడ్జి స్థాయిలో రాణించడానికి తన తండ్రి అచంచలమైన శ్రమ ఉన్నదని, ఆ శ్రమకు ఫలితం అందించడానికే కష్టపడి చదివి జడ్జిగా ఎంపికయ్యానని తెలిపారుఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి కనకం సూరిబాబు ,సుజాతనగర్ ఐక్యవేదిక మండల అధ్యక్షులు వేల్పుల భాస్కర్, ఉపాధ్యక్షులు కత్తి బాలకృష్ణ అంకి శెట్టి రామకృష్ణ, సహాయ కార్యదర్శి కేసు పాక వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారులు కత్తి వెంకన్న ,బుడగ జంగాల జిల్లా నాయకులు సిరిగిరి మురళి ,ప్రత్యేక ఆహ్వానితులు మందా రాజు మురిపిటి నాగేష్ తదితరులు పాల్గొన్నారు