Listen to this article

జనంన్యూస్. 12. నిజామాబాదు.ప్రతినిధి.

నిజామాబాదు..అవార్డు దక్కడం అభినందనీయం బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి..

జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విద్యుత్ శాఖ ఏడిఈ తోట రాజశేఖర్ కు రెడ్ క్రాస్ లో రాష్ట్రపతి అవార్డు దక్కడం అభినందనీయమని అన్నారు. సమాజ సేవలో ముందుంటూ అందరికీ సేవలు అందిస్తూ ప్రగతి సాధిస్తున్న జిల్లా రెడ్ క్రాస్ రాష్ట్రంలోని ప్రగతి పథంలో నడవడం జిల్లాకే గర్వకారణం అని అన్నా రు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా సమాజంకై సేవలు అందించాలని అప్పుడే అభివృద్ధికి బాటపడుతుందని చెప్పారు. రాజశేఖర్ ఇటు వృత్తిలోనూ అటు సేవారంగంలోనూ ముందుంటూ ఆదర్శంగా నిలుస్తున్నాడని ప్రశంసించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో కార్యక్రమంలో కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార సమైక్య లిమిటెడ్ చైర్మన్ మరియు జిల్లా డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు, కోశాధికారి కరిపే రవీందర్, జూనియర్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ రవీందర్ అబ్బాపూర్, నాయకులు ప్రవీణ్ రెడ్డి, మైపాల్ రెడ్డి , జనరల్ ఇన్సూరెన్స్ సహాయ మేనేజర్ రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సుదర్శన్ రెడ్డి. తోట రాజశేఖర్ ను శాలువతో సత్కరించారు.