Listen to this article

జనం న్యూస్,మే12,అచ్యుతాపురం:

మండలంలోని చోడపల్లి గ్రామంలో రూ.5 లక్షల ఎంపీపీ నిధులతో డ్రైనేజీ, రూ.2.50 లక్షలతో మంజూరు అయిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీపీ కోన సంధ్య, బుజ్జి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ కోన బుజ్జి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పారిశుధ్యం కోసం డ్రైనేజీ, ప్రజల రాకపోకలకు అనువుగా సీసీ రోడ్డు పనులకు నిధులు కేటాయించామని, త్వరితగతిన పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామని తెలిపారు.గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు కలిసి చోడపల్లిని అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తున్నారని సర్పంచ్ భాను వెంకట్ అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ గండి బోయిన భాను వెంకట్, మాజీ ఎంపీపీ వడిసెల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ కర్ర అప్పారావు, కాకి నూకరాజు, ఎల్లా నూకనాథం, సింహాచలం రామస్వామి, బయన్న, ముత్తయ్య, వడిసెల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.