Listen to this article

బిజెపి వెంకటాపురం మండల ప్రధాన కార్యదర్శి సాధన పల్లి విజయ్ కుమార్

మే 12 జనం న్యూస్ వెంకటాపురం మండల ప్రతినిధి బట్ట శ్రీనివాసరావు

ఈరోజు వెంకటాపురం మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సిబిల్ స్కోర్ ఆధారంగానే ఎంపిక చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని బిజెపి వెంకటాపురం మండల ప్రధాన కార్యదర్శి సాధన పల్లి విజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. సిబిల్ స్కోర్ నిబంధన వెంటనే ఎత్తువేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టి, బిసి, మైనారిటీ ఇ బీసీలలో ఉన్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు 6000 కోట్ల రూపాయలతో 5 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని నిర్ణయం చేసి దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తులు స్వీకరణ పూర్తి అయిన తర్వాత సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టడమే అవుతుందని విమర్శించారు కనీసం 10 లక్షల వరకు నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయం వలన అనేక మంది పేదలకు ఒక్కరికి కూడా రాజీవ్ యువ వికాసం రుణాలు వచ్చే అవకాశం లేదని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సిబిల్ స్కోర్ నిబంధనను ఎత్తివేయాలని సాధన పల్లి విజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .