

జనం న్యూస్ మే 12 కాట్రేనికోన
ముమ్మిడివరం 12 :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తాడేపల్లి గుంటూరు వారి ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్ నివారణ ,నియంత్రణ సంస్థ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వారు సంయుక్తంగా మే నెల 12-నుండి జూన్ 30 వరకు వీధి నాటకము ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన చేయుట కొరకు కళాజాత బృందంతో ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ సూపర్వైజర్ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ విభాగం ఏ. బుజ్జిబాబు ముమ్మిడివరం లో ఈరోజు కళాజాత బృందం ద్వారా జరిగే వీధి నాటక కార్యక్రమాన్ని ముమ్మిడివరం మార్కెట్ సెంటర్ లో ఈ కళాజాత వీధి నాటక ద్వారా హెచ్ఐవి ఎలా వ్యాప్తి చెందుతుంది , ఎలా వ్యాప్తి చెందదు ,హెచ్ఐవి /ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా సమాజంలో వారితో కలిసి ఎలా జీవించాలి,హెచ్ఐవి/ఎయిడ్స్ క్షయ వ్యాధి సంబంధించి,సుఖ వ్యాధులు మరియు చికిత్స గురించి, కండోము యొక్క ఉపయోగం గురించి,హెచ్ఐవి/ఎయిడ్స్ ఉన్నయెడల ఏఆర్ టి మందులు ఎలా వాడాలి అనే దానిపై ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం ఈ కళాజాత ప్రోగ్రాం ని ప్రారంభించడం జరిగింది.ఈ కళాజాత ప్రోగ్రాం ఎక్కువ ప్రజలు ఉన్నటువంటి ప్రదేశాలలో మార్కెట్ ఏరియాలో,రవాణా సౌకర్యము రద్దీగున్న ప్రదేశాలలో హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధి ప్రభావితం ఉన్నటువంటి గ్రామాలలో ఈ వీధి నాటకము ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ పై పూర్తి అవగాహన కల్పించే నిమిత్తం ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా జరుగుతుందని జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబి అధికారి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో,ఎ.బుజ్జిబాబు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ,నివారణ విభాగం కాకినాడ,సిబ్బంది,ఐసిటిసి ముమ్మిడివరo, జన కళ్యాణ్ సంస్థ మేనేజర్ శ్రీనివాస్, సి హెచ్ సి . ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్ ఐసిటిసి కౌన్సిలర్ టి. అంజలీదేవి, రాష్ట్ర సాధికార అంగన్వాడీ డ్రోక్రా ఆర్గనైజింగ్ సెక్రటరీ మెండి కమల,బ్లడ్ స్టోరేజ్ యూనిట్ మరియు ఐసిటిసి కొత్తపేట సిబ్బంది, నల్లం దుర్గాప్రసాద్, వెంకటరత్నం, రేవు కిషోర్, చెల్లి ఈశ్వరి, జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ , లింక్ వర్కర్స్ , వర్కర్స్ ,సిబ్బంది, సత్యనారాయణ, శాంతి, ఏఎన్ఎం వెంకటరమణి, అమల, లోకేష్, రామలక్ష్మి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
