Listen to this article

జనం న్యూస్ మే 12 కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వడ్డీ నాగేశ్వరరావు.

సోమవారం ఉదయం 8:30 నిమిషములకు ముమ్మిడివరం నగర పంచాయతీ పోలమ్మ చెరువుగట్టు జై బుద్ధ పార్క్ నందు 25 69 వ వైశాఖ పూర్ణిమ బుద్ధ జయంతి కార్యక్రమం జరిగింది.అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ గౌరవ అధ్యక్షులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు వడ్డీ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ భారతదేశ కీర్తి ప్రతిష్టలు గౌతమ బుద్ధుని జననం వలన ప్రపంచ దేశాలలో శాంతి సందేశానికి చిహ్నంగా నిలిచిందని, భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బౌద్ధాన్ని రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా బౌద్ధం యొక్క విశిష్టత ప్రపంచ దేశాలలో మనుగడలో ఉంది ఈ విషయమై శాంతి సందేశాన్ని శాస్త్రీయ దృక్పథాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయి అని వక్తలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాశి బాబు జగజీవన్ రావు, దోనుపాటి ఆంజనేయులు, కాశి సిద్ధార్థ కుమార్, కాశి సింహాద్రి వరియ, ముంగండ ఆశీర్వాదం, బొజ్జ బాలకృష్ణ, దాసరి సత్యనారాయణ, కాశి అప్పారావు, ముదే వెంకట్రావు, కాశి రామచంద్రరావు, సబ్బతి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.