Listen to this article

జనం న్యూస్ జనవరి 20 కాట్రేనికోన ఉప్పూడి గ్రామంలో గతంలో చమురు,సహజవాయువు వెలికితీతలో భాగంగా ప్రైవేటు స్థలం లీజుకు తీసుకుని కార్యకలాపాలు చేశారు. పీహెచ్ఎస్ సంస్థ బొబ్బిలి పాపారావు, మద్దింశెట్టి ఈశ్వరరావు,గొల్ల కోటి నాగపార్వతి ల నుండి స్థలం తీసుకున్నారు. గ్యాస్ వెలికితీతలో భాగంగా బ్లవుట్ సంభవించడంతో సదరు సంస్థ చేతులెత్తేసింది. ఎంపీ చొరవతో ఎల్ ఎన్ జి భారత్ కంపెనీకి సబ్ లీజుకు ఇచ్చారు. సుమారు ఆరు సంవత్సరాల నుండి లీజ్ పెండింగ్ లో ఉంది. రంబాల దొరబాబు ఆధ్వర్యంలో పలుమార్లు గంటి హరీష్ మాధుర్ను కలిసి బాధితులు విన్నవించుకున్నారు. గతంలో ఈ విషయమై బాధితులు ధర్నాకు కూడా దిగారు. ఎంపీ హరీష్ మాధుర్ ఓఎన్జిసి అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి నీ కలిసి పరిస్థితిని వివరించారు. దీంతో బాధితులకు సుమారు 15 లక్షలు లీజు సొమ్ములు విడుదలైనట్లు దొరబాబు తెలిపారు. ఈ విషయంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సహకారం ఎంతో ఉందని అన్నారు. గ్రామస్తులకు అందవలసిన పరిహారం విషయంలో కూడా ఎంపీ కృషి చేస్తున్నారని ఆయన వివరించారు. ఎంపీ హరీష్, ఓఎన్జిసి అధికారులకు లీజు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు