

జనం న్యూస్,మే12,అచ్యుతాపురం:
అంగన్వాడి వర్కర్స్ ను పెన్షన్ విధులు నుంచి మినహాయించాలని అచ్యుతాపురం ఎంపీడీవోకి అంగన్వాడి కార్యకర్తలు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా అంగన్వాడి యూనియన్ నాయకులు నారాయణమ్మ, అంబిక మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ రకరకాలు యాప్స్ వలన పనిభారం పెరిగిందని,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లో గ్రామాల్లో పెన్షన్ పంపిణీలో సచివాలయం సిబ్బందికి రెండు,మూడు నెలలు సహకరించాలని కోరడంతో అంగీకరించామని,పెన్షన్ పంపిణీ చేసే సమయంలో అదే కొనసాగింపుగా డబ్బులు కూడా అంగన్వాడి కార్యకర్తలకి ఇచ్చి కొన్ని చోట్ల పెన్షన్ పంపిణీ యమంటున్నారని,
1వ తేదీ నుంచి పిల్లల బరువు తీయడం, టిహెచ్ఆర్ పంపిణీ చేయడం, పిల్లలకు పోషకాహారం వండి పెట్టడం, ప్రీ స్కూల్ నిర్వహించటం,యాప్ లో అప్లోడ్ చేయడం ఇలా అనేక పనులతో సతమతమవుతున్న పరిస్థితిలో డబ్బుతో కూడుకునే పనిలో ఏ చిన్న పొరపాటు జరిగిన మా ఉద్యోగాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఉందని,ఇటీవలే గుంటూరులో రాజకీయ జోక్యంతో ఒక అంగన్వాడీ వర్కర్ ను సస్పెండ్ చేశారని,అంగన్వాడి సెంటర్ విధుల నిర్వహణకు ఆటంకంగా ఉంటుందని, పెన్షన్ విధుల నుంచి అంగన్వాడీ వర్కర్స్ లను మినహాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.