

జనం న్యూస్ మే 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రేపు అనగా మే 13 వ తేదినపరిధిలో 4 పరీక్ష కేంద్రాలలో నిర్వహించే పాలీసెట్ – 2025 పరీక్షల సందర్భంగా ఆయా పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు ఐ.పి.ఎస్ సోమవారం ఓక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని సూచించారు. అదేవిధంగా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పెర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ఉదయం 07:00 నుండి మధ్యాహ్నం 03:00 వరకు ముసివేయాలని సూచించారు. పరిక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు తో పాటు ట్రాఫిక్ ఆంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పకడ్బంది చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.