Listen to this article

జనం న్యూస్ రిపోర్టర్ నర్సంపేట 12/05/2025(సోమవారం )

ఈ నెల 15వ తారీకు నుండి కాళేశ్వరంలో జరగబోయే సరస్వతీ పుష్కరాలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ తెలిపారు.సరస్వతి పుష్కరాలు 2025 మే 15 నుండి 26 వరకు తెలంగాణలోని కాళేశ్వరంలో జరుగుతాయి.సరస్వతి నదిలో పవిత్ర స్నానాలు చేయడం దైవిక ఆశీర్వాదాలను తెస్తుందని మరియు పాపాలను కడిగివేస్తుందని నమ్ముతూ భక్తులు స్నానాలు చేస్తారుప్రాముఖ్యత: ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే అరుదైన పండుగ. ఇట్టి సదావకాశాన్ని భక్తులు వినియోగించుకోగలరని కోరారు.