Listen to this article

భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కర్

జనం న్యూస్ మే 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

బుద్ధుని శాంతి మార్గం ద్వారానే ప్రపంచ మానవాళి రక్షణ జరుగుతుందని భారతీయ బౌద్ధ మహా సభ జిల్లా అధ్యక్షులు అశోక్ మాహుల్కర్ అన్నారు. సోమవారం వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్ లో నిర్వహించిన 2568వ బుద్ధ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రపంచ మానవాళికి తథాగత్ భగవాన్ గౌతమ్ బుద్ధుడు అందించిన ప్రజ్ఞ, శిల్,కరుణలాతోపాటు జీవహింస చేయకూడదని సందేశం మానవజాతికి ఎంతో ఉపయోగపడుతుందని తద్వారా మనిషి మనిషిని గుర్తించి సంస్కరించబడతార ని, అన్నారు. మానవజాతి అంతా సమానమని సమ సమానత్వాన్ని చాటిచెప్పిన తథాగతుడు మానవ సుఖమయ జీవితానికి బాటలు వేశారని వాటిని మనం గ్రహించి ముందుకు సాగాలని ఆయన అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 19 56 అక్టోబర్ 14న భారతదేశంలో బౌద్ధ మతానికి పునర్జీవం పోసారని, ప్రపంచ జ్ఞాని ఆయన అంబేద్కర్ బాటలోనే దళితులంతా నడవాలని భారతీయ బౌద్ధమసభ జిల్లా కోశాధికారి, దుర్గం తిరుపతి అన్నారు. అనంతరం రామ్ నగర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ధర్మాబాయి, తదితరులు పాల్గొన్నారు