

జనం న్యూస్ మే 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
వాంకిడి మండలంలోని ఖీరిడి గ్రామ పంచాయతీ పరిధిలోన్ని ఎస్టీ వాడ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించలని జిల్లా అడిషనల్ కలెక్టర్ కి ప్రజా సంఘాల నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్బంగా వారు అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎస్టీ వాడ ఏర్పడి సంవత్సరాలు గడిచినా ఆ వాడలలో మురికి కలువ,సీసీ రోడ్లు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలం వస్తె మోకాళ్ళ లోతులో నీళ్లలో నడుస్తూ పనులు చేస్తునట్టువంటి పరిస్థితి పిల్లులు పాఠశాలకు వెళ్ళాలంటే బురదను దాటి వెళ్ళాలి కావున జిల్లా అధికారులు స్పందించి ఎస్టీ వాడ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి వాడ అభివృద్ధి కొరకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు గెడం టికానంద్, గొడిసెల కార్తీక్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, టిఎజిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్, మరియు గ్రామస్తులు నానివేణి లక్ష్మి , అదే విమల భాయ్ , మోహర్లె తరాబాయి, అదే లక్ష్మి, సండే కమల భాయ్ నాగోస్ లక్ష్మి సెండే తార బాయి సెందే దేవి రామ గుండం చంద్రకళ మొహర్లె శంకర్ వసకే కలాబాయి గురునూలే భారతి. ముహర్లె కమ్మ లాభాయి తదితరులు పాల్గొన్నారు