Listen to this article

జనం న్యూస్ 13 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

గతేడాది నవంబర్‌లో నమోదైన గంజాయి కేసులో ఇద్దరు నిందితులను సోమవారం అరెస్టు చేశామని ఒకటవ పట్టణ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన దిలీప్‌తో పాటు ఒడిశాకు చెందిన శిబరాం పట్నాయక్‌ను అదుపులోకి తీసుకొని రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.
కోగ్టులో హాజరు పరచగా ఇద్దరికి 14 రోజుల రిమాండ్‌ విధించారని చెప్పారు.