Listen to this article

వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులు

భారత దేశానికి,సైన్యానికి ఎలాంటి హాని కలగకూడదని
ప్రార్థనలు

జనం న్యూస్ న్యూస్12 మే బీమారం మండల ప్రతినిధి కాసిపేటరవి

భీమారం మండల కేంద్రంలోని ఆవడం ఎక్స్ రోడ్డు వద్ద భారతదేశానికి, దేశ సైనికులకు ఉగ్రవాదుల నుండి ఎలాంటి హాని కలుగకూడదని, ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా భారతదేశం సర్వ శుభములతో విజయకేతనం ఎగురవేయాలని, మహిషాసుర మర్దిని అవతారమెత్తి రాక్షసులను అంతమొందించినట్లు ఉగ్రవాదులు అంతం కావాలని,దేశ సరిహద్దుల్లోని జవాన్లకు అన్ని దేవతల యొక్క ఆశీస్సులను అందించాలని కోరుతూ…మండలంలోని కాంగ్రెస్ జిల్లా నాయకులు పోడేటి రవి మాజీ జెడ్పిటిసి జరుపుల రాజ్ కుమార్ నాయక్ వేల్పుల శ్రీనివాస్ కొక్కుల నరేష్ వర్తక వ్యాపారస్తులు ఈసం పెళ్లి రాజేష్ మీడియా మిత్రులు పోగుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా మరణించిన జవాన్లకు ఆత్మ చేకూరాలని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు,