

జనం న్యూస్ మే 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
వేసవి కాలం కావడం వల్ల దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందనీ,మీ వ్యవసాయ పొలాల దగ్గర ఉన్న మీ వ్యవసాయ మోటార్లను ఇతర పరికరాలను తీసుకుని, ఇంటిలో భద్రపరుచుకోవాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో మండల రైతులకు సూచించారు. రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టవద్దని,నిప్పు పెట్టడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలియజేశారు.రైతులు మేతకు పశువులను వదిలిపెట్టడం వల్ల అవి దొంగలించబడే అవకాశం ఉందని,రైతులు పశువులను మేతకు వదల వద్దని రైతులకు సూచించారు.