Listen to this article

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం రూపొందించిన ఫార్మర్ రిజిస్ట్రీ కార్డును రైతులు నమోదు చేసుకోవాలని, ఏఈఓ. నవీన్ కుమార్ కోరారు. మంగళవారం కర్చల్ గ్రామం గ్రామపంచాయతీ కార్యాలయంలో రైతు గుర్తింపు కార్డులను నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామని ఏఈఓ. నవీన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్లస్టర్ పరిధిలోని రైతులు రైతు వేదికకు వచ్చి నమోదు చేసుకోవాలని సూచించారు. ఈనెల 5 నుంచి జూన్ 6వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. ఆధార్ తరహాలో 11 నంబర్లతో కూడిన విశిష్ట గుర్తింపు కార్డును ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. రైతులందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో కర్చల్ గ్రామ ఆదర్శరైతు. డి. పవన్ కుమార్. వార్డు మెంబెర్ ముదిరాజ్ శ్యామ్. మడుపతి. సంగమేశ్వర్ స్వామి. ముదిరాజ్ లక్ష్మణ్. డోవుర్. మహిపాల్ రెడ్డి. బాధారగామ. యాదయ్య. గరూపల్లి ప్రేమ్ కుమార్. చాకలి. నగేష్. జలిపల్లి. రామమ్మ పాల్గొన్నారు.