Listen to this article

జనం న్యూస్ జనవరి 20(నడిగూడెం) ఈ నెల 21నుండి 23వ తేదీ వరకు మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా పాలన గ్రామ సభలను తగిన ఏర్పాట్లను చేసి పకడ్బందీగా నిర్వహించాలని కోదాడ ఆర్డివో సూర్యనారాయణ అన్నారు.గ్రామసభల నిర్వహణపై మండల స్పెషల్ ఆఫీసర్,డీఎఫ్ఓ సతీష్ కుమార్ తో కలసి మండల అధికారులతో నడిగూడెం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలలో తహశీల్దార్ సరిత, ఎంపీడీవో సయ్యద్ ఇమామ్, ఏవో దేవప్రసాద్, ఎంపీఓ విజయలక్ష్మి,జిపి స్పెషలాఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు…