Listen to this article

జిఎం హెచ్ఆర్డి రఘుపతి ని కలిసి వినతి పత్రం

తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్…

జనం న్యూస్ 13 మే( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ )

తెలంగాణ వ్యాప్తంగా అనేకమంది విద్యార్థులు టెక్నికల్గా నాన్ టెక్నికల్గా ఐటిఐ బీటెక్ మరియు తదితర టెక్నికల్ కోర్సులు చదివి వారికి సరియైన నైపుణ్యాల్లో శిక్షణ లేకుండా ఆ రంగాలలో సరియైన శిక్షణ లేకుండా అనేకమంది నిరుద్యోగ యువత తెలంగాణ వ్యాప్తంగా అన్యాయం అయిపోతున్నారని సింగరేణి వ్యాప్తంగా ప్రతి ఏరియాలో మూడు నాలుగు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వారి చదువుకు తగ్గ భవిష్యత్తు తరాలకు అవసరమయ్యే ప్రస్తుత సమాజంలో టెక్నికల్ గా వాళ్లకు అవసరమయ్యే స్కిల్ ను నిరుపేద నిరుద్యోగ యువతకు నేర్పించి సమాజంలో మెరుగైన విద్యను అందించడంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అభివృద్ధి చేస్తే నాణ్యమైన పని తెలిసిన అభ్యర్థులు అన్ని పారిశ్రామిక రంగాలలో ముఖ్యంగా సింగరేణిలో కూడా నాణ్యమైన ఉద్యోగస్తులు దొరుకుతారని ప్రతి ఏరియాలో ఐదు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు సింగరేణి వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ మంగళవారం సాయంత్రం జీఎం హెచ్ఆర్డి రఘుపతి ని మర్యాదపూర్వకంగా కలిసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వల్ల ఉపయోగాలు విద్యార్థులకు వారు చదువుకున్న సబ్జెక్టులలో డిగ్రీలలో బీటెక్లలో స్కిల్స్ లేకపోవడం వలన నిరుద్యోగులు ఎంత అన్యాయం అయిపోతున్నారు నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఎంత అన్యాయం అయిపోతున్నారు స్కిల్స్ లేకపోవడం వలన ఆ విద్యార్థులకు బయట ప్రైవేట్ కంపెనీలలో గాని ప్రభుత్వ రంగ సంస్థల్లో గాని మనలాంటి సింగరేణి సంస్థలు ఉద్యోగాలు రాకపోవడానికి ఎక్కడ వెనుకబడి పోతున్నారు కారణాలు చెప్పి సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఐఆర్ఎస్ గొప్పగా ప్రతి ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి సి ఎస్ ఆర్ ఫండ్ నిధులను విడుదల చేస్తూ నిరుపేద విద్యార్థులందరూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వారికి చదువుకు తగ్గ స్కిల్స్ నేర్చుకుని భవిష్యత్తులో ఉన్నత అవకాశాలు అధిరోహించాలని సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సార్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారని కొత్తగూడెంలో కూడా 5 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కార్పొరేట్ ఏరియాలో మైన్స్ ఏరియాలో ముఖ్యంగా ఐదు సెంటర్లు ఏర్పాటు చేయాలని అదేవిధంగా సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ లు కూడా అందులో శిక్షణ ఇవ్వాలని నిరుపేద డిగ్రీ పాసైన విద్యార్థులందరికీ సివిల్ సర్వీస్ కోచింగ్ కోసం కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా ఏర్పాటు చేస్తూ సింగరేణి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ని కొత్తగూడెంలో ఏర్పాటు చేయాలని ఆల్రెడీ సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కి మా సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగిందని కిందిస్థాయిలో అధికారులు దానికి పునాది వేయాలని ఈ సందర్భంగా కోట శివశంకర్ జిఎం హెచ్ఆర్డి రాకపోతే ని విజ్ఞప్తి చేయడం జరిగింది..