Listen to this article

చిన్నగొట్టిగల్లు జనవరి 20 జనం న్యూస్: ఏనుగుల దాడులలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బెల్లంకొండ మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బాకరాపేట శ్యామల రేంజ్ అటవీ శాఖ అధికారి వెంకటరమణకు అధ్యక్షుడు బెల్లంకొండ మురళి ఆధ్వర్యంలో కుటుంబ శ్రేణులు రైతులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బెల్లంకొండ మురళి స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత రెండు మూడు నెలలుగా ఏనుగులు గుంపు బీభత్సం చేసి రైతు పంటలను నాశనం చేశాయని అన్నారు. అప్పో సప్పో చేసి పంటలను పండించుకుంటున్న రైతులకు ఏనుగుల దాడులతో అప్పులే మిగిలి నిస్సహాయ స్థితిలో కి వెళ్లిపోయారని ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏనుగుల దాడులలో నష్టపోయిన వరి పంట రైతులకు ఎకరాకి లక్ష రూపాయలు టమోటా ఇతరత్రా పంటలకు రెండు లక్షల రూపాయలను నష్టపరిహారంగా ప్రభుత్వం అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. నారావారిపల్లి ఉపసర్పంచ్ రాకేష్ కుమార్ ఏనుగుల దాడులలో మరణించడం తమను ఎంతగానో తీవ్రంగా కలచివేసిందన్నారు.వారి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. ఏనుగుల దాడులలో నష్టపోయిన ప్రతి కుటుంబాన్నికి నష్టపరిహారం అందించాలని ఆ దిశగా అధికారులు చేపట్టాల్సిన చర్యలు వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ నాగచంగమ నాయుడు మాజీ సర్పంచ్ సుబ్రమణ్యం,మునిస్వామి నాయుడు,నాగిరెడ్డి,రవీంద్ర రెడ్డి వెంకటరత్నం హరినాథ్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి చంద్రారెడ్డి ముని రామయ్య రత్న,రాధా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు