Listen to this article

జనం న్యూస్ 15 మే 2025 రుద్రూరు మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మొహమ్మద్ న్యూస్ ప్రతినిధి ) రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో బుధవారం నాడు హజరత్ ఖాజా బందా నవాజ్ ర.ఆ 621వ ఉత్సవాలను దర్గా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దర్గాలో చాదర్,సందళ్, పూల్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉర్సు ఉత్సవాలకు కులమతాలకు అతీతంగా భక్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దర్గా వద్ద భక్తులకు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మజీద్ సదర్ షేక్ మొహమ్మద్, సికిందర్ ఖాద్రి, ముద్దసీర్ అలీ,షేక్ మన్సూర్, షేక్ జమీర్,మొహమ్మద్ మతిన్, షేక్ నహీం పాషా,మొహమ్మద్ లోఖ్మాన్ రఫీ, మొహమ్మద్ అక్రమ్,షేక్ బురాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు