

ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
జనం న్యూస్,మే15,అచ్యుతాపురం:
యలమంచిలి నియోజవర్గంలో చదువుకున్న యువత ఖాళీ ఉండకుండా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక గురజాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన నియోజకవర్గస్థాయి మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలుపుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన మాట ప్రకారం అంచెలంచెలుగా జాబ్ మేళాలు నిర్వహించి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని, ఈరోజు 26 మెగా కంపెనీలలో సుమారు 3వేల మంది యువతీ యువకులను ఎంపిక చేసి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కంపెనీ హెచ్ఆర్ లు, సిబ్బంది,నిరుద్యోగ యువత పాల్గొన్నారు.