

జనంన్యూస్. 15. నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాదు. ఆర్మూర్ మరియు ఇతర మండలం లలో జరిగిన వరుస చైన్ స్నాచింగ్ కేసులలో నిందితుల అరెస్టు : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడి
క్రైమ్ నెంబర్ : 203/2025 U/Sec 309 (4) BNS ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ధర్యాప్తు అధికారులు జే. వెంకటేశ్వర్ రెడ్డి, ACP-ఆర్మూర్ గారి ఆద్వర్యం లో పి. సత్యనారాయణ, ఇన్స్ పెక్టర్ అఫ్ పోలీస్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్
కే. శ్రీధర్ రెడ్డి, సర్కిల్ ఇన్స్ పెక్టర్ అఫ్ పోలీస్, ఆర్మూర్ రూరల్. . వి. రజిని కాంత్, సబ్ ఇన్స్ పెక్టర్ అఫ్ పోలీస్ ముప్కాల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదిరాలి యొక్క పేరు మరియు వివరములు : శ్రీమతి. బొబ్బిలి లక్ష్మి w/o నరేశ్, వయ్యస్సు: 50 సం,,లు, కులం: బెస్త, వృత్తి: బీడీలు చేయుట R/o ఫత్తెపూర్ గ్రామం ఆర్మూర్ మండలం.
నేరస్థుల యొక్క వివరాలు : A-1) శ్రీనివాస్ సాహెబ్ రావ్ పిటేవాడ్ @ మాధవ్ S/o సాహెబ్ రావ్ పిటేవాడ్, వయ్యస్సు: 19 సం,,లు, కులం: వడ్డెర, వృత్తి: కూలీ పని R/o పొంనాల, సొనారి పోస్ట్ భోకర్ తాలూకా నాందేడ్ జిల్లా మహారాష్ట్ర A-2) గోరే కేశవ్ సురేశ్ @ శ్రీను S/o సురేశ్, వయ్యస్సు: 25 సం,,లు, కులం: వడ్డెర, వృత్తి: కూలి పని R/o రేనాపూర్, భోకర్ తాలూకా నాందేడ్ జిల్లా మహారాష్ట్ర A-3) పుర్బాజీ బాలాజీ ఇర్లేవాడ్ S/o బాలాజీ, వయ్యస్సు: 29 సం,,లు, కులం: వడ్డెర, వృత్తి: ట్రాక్టర్ డ్రైవర్ R/o పొంనాల గ్రామం, సొనారి పోస్ట్ భోకర్ మండలం నాందేడ్ జిల్లా మహారాష్ట్ర A-4) ఎలిశెట్టి శ్రీనివాస్ S/o చిన్న, వయ్యస్సు: 41 సం,,లు, కులం: మున్నూరు కాపు, వృత్తి: వ్యవసాయం తల్వాడ (తల్వేద) గ్రామం నిర్మల్ మండలం మరియు జిల్లా
A-5) రాజు అప్పారావ్ పిటేవాడ్ S/o అప్పారావ్, వయ్యస్సు: 28 సం,,లు, కులం: వడ్డెర, వృత్తి: కూలిపని R/o పొంనాల గ్రామం, సొనారి పోస్ట్ భోకర్ మండలం నాందేడ్ జిల్లా మహారాష్ట్ర A-6) విజయ్ A-7) దండేవాడ్ బాబునేరస్థులను అరెస్టు చేసిన తేదీ మరియు స్థలము: తేదీ: 15.05.2025 నాడు ఉదయం అందాజ 09:00 గంటల ప్రాంతంలో పెర్కిట్ బైపాస్ దగ్గర గల NH-44 రోడ్డు పై. నేరస్థుల నుండి స్వాదీనం చేసుకున్న వస్తువుల యొక్క వివరములు : 1) బంగారు పూస్తేల త్రాడు బరువు సుమారు 14 గ్రాములు. 2) బంగారు ఛైను బరువు సుమారు 10 గ్రాములు. 3) బంగారు గొలుసు బరువు సుమారు 23 గ్రాములు. 4) బంగారు గుండ్ల పేరు బరువు సుమారు 10 గ్రాములు 5) బంగారు పూస్తేల గుండ్ల పేరు బరువు సుమారు 5 గ్రాములు. 6) బంగారు గొలుసు బరువు సుమారు 20 గ్రాములు. 7) బంగారు గొలుసు బరువు సుమారు 20 గ్రాములు. 8) బంగారు గొలుసు బరువు సుమారు 20 గ్రాములు. 9) ఒక ట్రాక్టర్ నంబర్ TS16EU1464 మరియు దాని ట్రాలీ TS16UC5200
10) Hero Splendor బైకు 11) MH26CR6549 నంబరు గల రాయల్ ఎన్ ఫీల్డ్ బైకు (మొత్తం 12.2 తులాల బంగారు ఆభరణాలు, రెండు బైకులు ఒక ట్రాక్టర్ స్వాధీనం) కేసు యొక్క పూర్తి వివరములు: కేసు యొక్క వివరములు ఏమనగా నిందితులు అయిన A-1) శ్రీనివాస్ సాహెబ్ రావ్ పిటేవాడ్ @ మాధవ్ A-2) గోరే కేశవ్ సురేశ్ @ శ్రీను A-3) పుర్బాజీ బాలాజీ ఇర్లేవాడ్ A-4) ఎలిశెట్టి శ్రీనివాస్ A-5) రాజు అప్పారావ్ పిటేవాడ్, A-6) విజయ్ మరియు A-7) దండేవాడ్ బాబు అందరూ మహారాష్ట్ర కు చెందినవారు. వీరు గత కొన్ని రోజుల నుండి బ్రతుకు దెరువు రీత్యా నిర్మల్ జిల్లాలోని మంజులపూర్ గ్రామానికి వలస వచ్చి కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నారు. కూలిపని చేయగా వచ్చే డబ్బులు వారి ఖర్చులకు కుటుంబ పోషణకు సరిపోక దొంగతనాలకు అలవాటు పడి A-1 యొక్క హీరో స్ప్లెండర్ బైకుపై మరియు A-3 యొక్క బుల్లెట్ బైకుపై అలాగే దొంగిలించిన హోండా షైన్ బైకుపై తిరుగుతూ ఆటోలో వెనుకలా కూర్చున్న మహిళ లను టార్గెట్ చేసుకుని ఆటో వెనుకాలే వెళ్ళి వారి మెడలో గల బంగారు చైన్ లను తెంపుకుని పోతుంటారు. అలా వీరు ఆర్మూర్ ఏరియాలో రెండు, ముప్కాల్ లో ఒకటి, సారంగాపూర్ మండలం లో రెండు, భైంసా మండలం లో ఒకటి, మెట్ పల్లి లో ఒకటి, జక్రాన్ పల్లి మండలం లో ఒక దొంగతనం ప్రయత్నం చేసి, ట్రాక్టర్ దొంగతనం చేసినారు. వీరే చేసిన వరుస దొంగతనాల వలన పోలీసుల నిఘా ఎక్కువై వీళ్ళు మహారాష్ట్ర లోని ఉమ్రి పారిపోయి మొబైల్ ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేసుకుని అక్కడే ఉండి, ఈ రోజు తేదీ 15.05.2025 నాడు వీరు రెండు బైకులపై మళ్ళీ దొంగతనం చేయాడానికి ఆర్మూర్ వైపునకు వస్తుండగా ఆర్మూర్ మండలం లోని పెర్కిట్ బైపాస్ దగ్గర వాహనాల తనికి చేస్తున్న ఆర్మూర్ పోలీసులు వీరిని పట్టుకుని విచారించగా వీరు చేసిన దొంగతనాలను ఒప్పుకోవడం జరిగింది. A-6) విజయ్ మరియు A-7) దండేవాడ్ బాబు లు పరారీలో ఉన్నారు. ఇట్టి కేసు ధర్యాప్తులో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్. ఆదేశాల మేరకు జే. వెంకటేశ్వర్ రెడ్డి ACP-ఆర్మూర్ ఆద్వర్యం లో పి. సత్య నారాయణ, ఇన్స్ పెక్టర్ అఫ్ పోలీస్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ . కే. శ్రీధర్ రెడ్డి, సర్కిల్ ఇన్స్ పెక్టర్ అఫ్ పోలీస్, ఆర్మూర్ రూరల్, వి. రజిని కాంత్, సబ్ ఇన్స్ పెక్టర్ అఫ్ పోలీస్ ముప్కాల్ పోలీస్ స్టేషన్ మరియు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ పార్టీ సిబ్బంది నేరస్తులను పట్టుకోవడంలో టీములుగా ఏర్పడి కృషి చేసినారు.
జే. వెంకటేశ్వర్ రెడ్డి, ACP-ఆర్మూర్ ఆద్వర్యంలో పి. సత్య నారాయణ, ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మూర్ PS, కే. శ్రీధర్ రెడ్డి, సర్కిల్ ఇన్స్ పెక్టర్ అఫ్ పోలీస్, ఆర్మూర్ రూరల్, . వి. రజిని కాంత్, సబ్ ఇన్స్ పెక్టర్ అఫ్ పోలీస్ ముప్కాల్ పోలీస్ స్టేషన్ మరియు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ పార్టీ సిబ్బంది అలాగే నిజామాబాద్ CDR సెల్ సిబ్బందిని నేడు పి. సాయి చైతన్య IPS నిజామాబాద్ కమీ షనర్ ఆఫ్ పోలీస్ అభినందించి వీరికి రివార్డు లు ఇచ్చి అభినందించడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమంలో పి. సాయి చైతన్య IPS నిజామాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో జే. వెంకటేశ్వర్ రెడ్డి, ACP-ఆర్మూర్ పి.సత్య నారాయణ, ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మూర్ PS, కే. శ్రీధర్ రెడ్డి, సర్కిల్ ఇన్స్ పెక్టర్ అఫ్ పోలీస్, ఆర్మూర్ రూరల్, వి. రజిని కాంత్, సబ్ ఇన్స్ పెక్టర్ అఫ్ పోలీస్ ముప్కాల్ పోలీస్ స్టేషన్ మరియు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ పార్టీ సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.