

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్బంగా ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం లో మండల వైద్యాధికారులు డాక్టర్ కె. శరత్ కమల్, డాక్టర్ డి.కార్తీక్ విశ్వనాధ్,సి.హెచ్.ఓ. వేంకటనారాయణ, పి.హెచ్. ఎన్.శైలజ, సూపెర్వైసర్ సునీల్,ఏ.ఎన్.ఏమ్స్,అమృతనాగలక్ష్మి ఆశాలు, ప్రజలు పాల్గోన్నారు. ఈ సందర్బంగా సి. హెచ్. ఓ డెంగ్యూ నివారణ పద్ధతులు అనవసర నీటినిల్వలు, అపరిశుభ్ర ప్రదేశాలు పరిశీలించడం వాటిని నిల్వ లేకుండా శుభ్రపరచడం -నీటి నిల్వ ఉంచిన పాత్రలపై మూతలు పెట్టడం గురించి విశదీకరించారు.