Listen to this article

జనం న్యూస్ 16 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

గడచిన ఆర్థిక సంవత్సరంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ లాభాల బాట పట్టిందని బ్యాంక్‌ సీఈవో ఉమామహేశ్వరరావు తెలిపారు. DCCB పర్సన్‌ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న JC సేతుమాధవన్‌ అధ్యక్షతన బ్యాంక్‌ మహాజన సభను కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. రూ. 7.66 కోట్లతో బ్యాంక్‌ను లాభాల బాట వైపు నడిపించిన సహకార సంఘాల సిబ్బందిని, DCCB సిబ్బందిని JC అభినందించారు.