Listen to this article

వైస్ చాన్సలర్ ఆచార్య. జి. పి రాజశేఖర్ నుంచి జర్నలిజం లోడాక్టరేట్ ఉత్తర్వులు అందుకుంటున్న రేగాన షణ్ముఖ రావు

జనం న్యూస్ 16 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్న లిజం విభాగ పరిశోధక విద్యార్థి సాలూరు వాసి రేగాన షణ్ముఖ రావు కు డాక్టరేట్ లభించింది. ప్రస్తుతం ఆంధ్రకేశరి విశ్వవిద్యాలయం ఇన్చార్జి ఉపకులపతి ఆచార్య డి.వి.ఆర్ మూర్తి పర్యవేక్షణలో డిఫ్యూజన్ ఆఫ్ ఇన్నోవేషన్ అమోంగ్ షెడ్యూల్ క్యాస్ట్ పాపులేషన్: ఏ స్టడీ ఆఫ్ మోసూరు విలేజ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ అనే అంశంపై జరిగిన పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ నుంచి డాక్టరేట్ ఉత్తర్వులను షణ్ముఖరావు శుక్రవారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను విభాగాచార్యులు, పరిశోధకులు అభినందించారు. ప్రస్తుతం షణ్ముఖరావు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం సమాచార పౌర సంబంధాల శాఖ లో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పి.ఆర్.ఓ.) గా విధులు నిర్వహిస్తున్నారు