Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

లేకుంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు-కమిషనర్

విచ్చలవిడిగా బ్యానర్లు, ఫ్లెక్సీ లు కడితే కఠిన చర్యలు కమిషనర్

చిలకలూరిపేట పట్టణం లో విచ్చలవిడిగా మున్సిపల్ అధికారులు అనుమతి లేకుండా బ్యానర్లు, ఫ్లెక్సీ లు రోడ్ కు అడ్డంగా, ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేస్తున్నారని, దీని వల్ల వాహన దారులకు ఇబ్బందిగా ఉందని కమిషనర్ శ్రీహరి తెలిపారు. కూడళ్ళ బ్యానర్లు ఉండడం తో అటు గా వచ్చే వాహనాలు, ఇటు వైపు వారికీ కనపడక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాలు నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. కమిషనర్ అనుమతి లేకుండా బ్యానర్లు, ఫ్లెక్సీ లు బోర్డు లు ఏర్పాటు చేస్తే మున్సిపల్ యాక్ట్ 1965ప్రకారం కఠిన చర్యలు ఉంటాయన్నా -కమిషనర్ శ్రీహరి అదేవిదంగా మున్సిపల్ ఆఫీస్ నుంచి అనుమతి పొందిన వారికే ఫ్లెక్సీ యాజమాన్యం వారు ఫ్లెక్సీ లు వేయాలని, లేని యెడల ఫ్లెక్సీ యూనిట్లపై కూడా చర్యలు ఉంటాయన్నా -కమిషనర్