

జనం న్యూస్ 16మే పెగడపల్లి ప్రతినిధి
జగిత్యాల జిల్లాపెగడపల్లి మండలంలోని నంచర్ల గ్రామంలో గత రాత్రి ఈదురు గాలులతో వ్యవసాయ బావులకు వెళ్లే విద్యుత్ వైర్లపై చెట్టు పడి విద్యుత్ స్తంభాలు విరిగి కింద పడగా ఈరోజు ఉదయం అనుకోకుండా కొత్త రవీందర్, వరాల సంపత్మరియు కత్తి లచ్చయ్యకు చెందిన మూడు గేదెలు అటువైపు మేతకు వెళ్లగా కిందపడి ఉన్న వైర్లకు తగిలి విద్యుత్ సరఫరాతో అక్కడికక్కడే మృతి చెందాయి.
ఈ విషయం తెలిసిన వెంటనే పెగడపల్లి ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అక్కడికి వెళ్లి రెవిన్యూ మరియు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలం కు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ విద్యుత్ లైన్మెన్ రామ్ సంజీవ్ మరియు ఆర్ ఐ శ్రీనివాస్ వచ్చి పరిశీలించి పంచనామా నిర్వహించారు. గేదెలు మృతి చెందిన బాధిత రైతులు అక్కడికి వచ్చిన అధికారులతో ఒక్కో గేద విలువ అందాల 80,000/- రూపాయలు ఉంటుందని మాకు గవర్నమెంట్ ద్వారా పూర్తిగా వాటికి సరిపడా ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలోమేకల రాయమల్లు దండు రమేష్ ఏలుపుల రాములు సల్కం గీత పలువురు రైతులు పాల్గొన్నారు.