

అచ్యుతాపురం(జనం న్యూస్):స్పోర్ట్స్ జీవో 2024 డిసెంబరు10న రగ్బీ క్రీడను క్యాటగిరీ ఏ లో చేర్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు శాప్ చైర్మన్ రవి నాయుడు ఆంధ్రప్రదేశ్ రగ్బీ క్రీడాకారుల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ అనకాపల్లి జిల్లా రగ్బీ అసోసియేషన్ సభ్యులు సమావేశం అచ్యుతాపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రగ్బీ అసోసియేషన్ వారు మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అండర్-11,14,18, సీనియర్ రాష్ట్రస్థాయి పోటీలు విజయవంతంగా నిర్వహించి రగ్బీ క్రీడని అభివృద్ధి చేసిన ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ సెక్రెటరీ బి.రామాంజనేయులుఏపీ ఆర్ఏ ప్రెసిడెంట్ టీజీ భరత్ కు అనకాపల్లి జిల్లా అసోసియేషన్ తరపున మరియు రాష్ట్ర క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రగ్బీ క్రీడాకారులకు చదువు మరియు ఉద్యోగాలలో క్రీడా కేతగిరీలో 3శాతం రిజర్వేషన్ కేటాయించడం రాష్ట్రంలో రగ్బీ కోచులకు చాలా సంతోషకరమైన విషయని,విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు.అనంతరం జిల్లా రగ్బీ అసోసియేషన్ సభ్యులు డైరీనీ ఆవిష్కరణ చేశారు.ఈ సమావేశంలో జిల్లా రగ్బీ అసోసియేషన్ ఛైర్మన్ కూండ్రపు వెంకు నాయుడు, ప్రెసిడెంట్ ఎస్ఎన్వి జగదీష్,వైస్ ప్రెసిడెంట్ రెడ్డి చిరంజీవి,కార్యదర్శి నాగ వెంకటరావు,జాయింట్ సెక్రటరీ డాక్టర్ సుధీర్,నిర్వహణ కార్యదర్శి వెంకట సత్యనారాయణ, కోశాధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.