

జనం న్యూస్ మే 17 ( కొయ్యూరు ప్రతినిధి సూపర్ స్టార్ కృష్ణ ) అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో స్థానిక రైతుబరుస కేంద్రాలలో పరిశీలించడం జరుగుతుందని స్థానిక వ్యవసాయ అధికారి ఉమాదేవి తెలిపారు దీనిలో భాగంగా రైతు సేవ కేంద్రాల సిబ్బంది తమ లాగిన్ లో వచ్చిన రైతుల వివరాలను పరిశీలించి వాళ్లని అప్రూవ్ చేయడం జరుగుతుంది ఆధార్ కార్డులో ఉన్న పేరు వెబ్ ల్యాండ్ ఉన్న పేరు సరిగా ఉన్నావి వాళ్లు అప్రూవ్ చేయడం జరుగుతుంది ఒక రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఒక కుటుంబం గా పరిగణించబడతారు ఈ కార్యక్రమంలో భర్త భార్య ఇద్దరు భూమి కలిగి ఉన్నప్పటికీ ఒక్కరికి మాత్రమే అర్హులగును. ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే “అన్నదాత సుఖీభవ ” నగదు సదుపాయం అందించబడుతుంది. ఆధర్ లో ఉన్న పేరు వెబ్ ల్యాండ్లో ఉన్న పేరు సరిగా లేనియెడల రెవెన్యూ అధికారి వారి లాగిన్ లో పంపబడుతుంది కాబట్టి రైతులు అటువంటి రైతులు స్థానిక వీఆర్వో దగ్గరకు వెళ్లి సరి చేసుకోగలరని రైతులకు ఉమాదేవి కోరారు