Listen to this article


భారతీయ త్రివిధ దళాల పరాక్రమ సంఘీభావ యాత్ర

జనం న్యూస్ మే 17 ( కొయ్యూరు ప్రతినిధి సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం 5 మండలాల జనసైనికులకు,వీర మహిళలకు,నాయకులకు విజ్ఞప్తి.
భారత దేశం ఉగ్రవాద నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో పోరాడిన మన త్రివిధ దళాల వీరులకు, వీర నారీమణులకు సంఘీభావం తెలుపుతూ భారత దేశం అంతటా తిరంగా యాత్ర చేపడుతున్నది. మన ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం తరుపున 16,17,18 వ తేదీలలో మన త్రివిధ దళాల వీరుల శౌర్య పరక్రమాలను మనం గౌరవించుకోవాలి వారికి సంఘీభావం తెలపాల్సిన బాధ్యత మనపై ఉన్నది.అందుకే కూటమి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మన పాడేరు నియోజకవర్గానికి శనివారం అనగా 17.05.2025 వ తేదిన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ కార్యక్రమం పెద్దయెత్తున చేపట్టనున్నాం .ఈ తీరంగా యాత్ర లో కూటమి నాయకులు కార్యకర్తలు భారీగా హాజరు కానున్నారు. మన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసియున్నారు.ఇది దేశ సమగ్రత శౌర్య పరాక్రమనికి సంబంధించిన అంశం జనసైనికులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు దేశం అంటే ఏమిటో పవన్ కళ్యాణ్ భావజాలంతో కలిసి సాగే విధానం కేవలం జనసైనికుల సొంతం కాబట్టి విధిగా 17.05.2025 వ తేది ఉదయం 11లకు పాడేరు లో జిల్లా కమిటి నాయకులు,మండల అధ్యక్షులు మరియు కమిటి, జనసైనికులు,వీర మహిళలు హాజరు కావాలని కోరుతున్నాం.అనంతరం 1 గంటకు బోజనాలు తర్వాత ఎవరి స్వస్థలాలకు వారు తిరుగు ప్రయాణం ఉంటుందని మీ పాడేరు నియోజకవర్గం మరియు అరకు పార్లమెంట్
జనసేన పార్టీ ఇంచార్జీ.
డా.. వంపూరు గంగులయ్య
కోరారు