Listen to this article

జిల్లా కలెక్టర్ కు టిపిటిఎఫ్ వినతి పత్రం

జనం న్యూస్, మే 18 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

సిద్దిపేట పాఠశాలల పరిశుభ్రత కోసం పనిచేస్తున్న స్కావెంజర్ల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు చిట్యాల విజేందర్ రెడ్డి,సుంచు నరేందర్,జిల్లా కార్యదర్శి సత్యనారాయణ లు జిల్లా కలెక్టర్ మనుచౌదరి,ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ పాఠశాలల పరిశుభ్రత కోసం స్కావెంజర్లను నియమిస్తూ,కి పది మసాల వేతనాలు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని, ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఆరు మాసాలకు సంబంధించిన వేతనాలు మాత్రమే విడుదల అయ్యాయని,పెండింగ్ లో ఉన్న నాలుగు మాసాల వేతనాలు విడుదల చేయాలని,6,7 తరగతులకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ లను అందించాలని,పాఠశాలల్లో కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ లను నియమించాలని, పాఠశాలల్లో గణిత ల్యాబ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ ని కోరారు.