Listen to this article

జనం న్యూస్ మే 17 భీమవరం మండలం ప్రతినిధి (కాసిపేట రవి )

మంచిర్యాల జిల్లా భీమారం మండలం శుక్రవారం రోజున ఉదయం అకాల వర్షం కురిసి మండల పరిధిలోని పలు గ్రామాలలో ఉరుములతో మెరుపులతో భారీ వర్షం కురిసికల్లాలలో కుప్పలుగా ఉన్న వరి ధాన్యం నేలపాలైంది ఐకెపి అధికారులు స్పందించి లారీలు రప్పించి తడిసిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు అకాల వర్షంతో తమకు తీరని నష్టం వాటిల్లిందని వాపోయారు అకాల వర్షం వల్ల తడిసి ముద్దయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తమకెంతో నష్టం వాటిల్లిందని సకాలంలో లారీలు వచ్చి త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం తెలియజేశారు