

డీలర్ల వద్దే కొనుగోలు చేయాలి
లూజుగా ఉన్న సంచుల్లోని విత్తనాలు కొనొద్దు
ఎంఆర్‌పీ ధర చూసుకోవాలి
వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటించాలి
పంటకాలం పూర్తయ్యే వరకు బిల్లులు భద్రంగా ఉంచాలి
మండల వ్యవసాయ అధికారి రాజు, మండల ఎస్సై ప్రవీణ్ కుమార్
జనం న్యూస్ మే 18(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని ఫర్టిలైజర్ దుకాణదారులకు మండల వ్యవసాయ అధికారి రాజు,ఎస్సై ప్రవీణ్ కుమార్ సూచించారు. రానున్న వానాకాలం సీజన్‌లో పంటలు పండించే రైతులు విత్తనాలు కొనుగోలు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. శనివారం మునగాల మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్లో వచ్చిన పత్తి విత్తనాలు పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజు మాట్లాడుతూ..వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని,రైతులు విత్తనాల కొనుగోలులో మోసపోవద్దని,జాగ్రత్తగా వ్యవహరించాలని రైతులకు సూచించారు.పత్తి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తప్పని సరిగా రసీదు పొందాలన్నారు.లైసెన్స్ లేని వారి దగ్గర విత్తనాలు కొనరాదని,వారి వివరాలు వ్యవసాయాధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. విత్తనాలు కొనేముందు తప్పనిసరిగా ఎంఆర్‌పీ ధర చూసుకొని, రసీదుపై సంతకాలు చేయాల్సిందిగా ఆయన రైతులకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రైతులకు నకిలీ విత్తనాలు, పురుగు మందులు,ఎరువులు అమ్మితే ఎంతటి వారినైన ఉపేక్షించేదిలెదని అన్నారు. రైతులకు విత్తనాలు, పురుగు మందులు ఇచ్చినప్పుడు తప్పని సరిగా రసీదులు ఇవ్వాలని తెలిపారు.అనమతులు లేని కంపెనీల నుంచి గాని, అథరైజ్డ్ లేని కంపెనీ విత్తనాలు,ఎరువులు, క్రిమి సంహారక మందులు అమ్మడం గాని చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుతుందని వారిపై పిడి యాక్ట్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.