Listen to this article

జనం న్యూస్,మే17, జూలూరుపాడు:

విద్యుత్ తీగలు తేగి పశువులకు తగలడంతో అక్కడికక్కడే పశువులు మృతి చెందాయి. వివరాలు….మండలంలో సూరారం గ్రామానికి చెందిన సూర్య,లక్ష్మి,నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు లకు చెందిన పశువులు సుమారుగా ఉదయం 9గంటల సమయంలో పంట పొలాల్లో మేత మేస్తుండగా రెండు ఎడ్లు పోట్లాడుకుంటూ దగ్గరలో ఉన్న విద్యుత్ స్తంభానికి తగలడంతో విద్యుత్ స్తంభం విరిగి, తీగలు తేగి పక్కనే ఉన్న మూడు ఆవుల మీద పడటంతో, ఆవులు మరియు పోట్లాడిన రెండు ఎడ్లు, మొత్తం ఐదు పశువులు విద్యుత్ తీగలకు తలిగి మృతి చెందాయి. పశువుల చనిపోవడంతో పశువుల యజమానులు పశువుల పై పడి రోధించిన ఘటన గ్రామస్తుల హృదయాలను కలిసి వేసింది. గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న జూలూరుపాడు విద్యుత్ శాఖ ఏఈ సతీష్ ప్రమాద జరిగిన తీరును పరిశీలించారు.