

జనం న్యూస్,మే17,
అచ్యుతాపురం:అచ్యుతాపురం మండలంలోని అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వెళ్లే రోడ్డు మార్గం మధ్యలో గల హరిపాలెం,కొండకర్ల మునగపాక ఆవ కాలువ బ్రిడ్జి పనులను స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కాంక్రీట్ వాల్ పనులను పరిశీలించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్టిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, బ్రిడ్జి పనులు వేగవంతంగా పూర్తిచేయాలని,నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మించాలని కాంట్రాక్టరుకు,అధికారులకు ఆదేశించడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.