

బిచ్కుంద ఏప్రిల్ 17 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద నందు ఈ విద్యా సంవత్సరానికి నూతన కోర్సులు బీ.ఎస్సీ ఫార్మసిటికల్ మరియు బి.కాం .హెచ్. ఆర్ . ఆపరేషన్స్ కోర్సులు మంజూరు అయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ కే. అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా నూతన కోర్సులను మన కళాశాలకు మంజూరు చేసినందుకు కమిషనర్ మేడం గారికి జెడి సార్ గారికి ఆర్జెడి సార్ గారికి మరియు c c e అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగ పరుచుకోవాలన్నారు